HomeTelugu Trendingరౌడీకి థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ

రౌడీకి థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ

Vijay Devarakonda sent clo
రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నటుడిగానే కాకుండా బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. విజయ్‌కు ‘రౌడీ’ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని త‌యారు చేపిస్తుంటారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండంతో సెలబ్రెటీలు కూడా వీటిపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. గ‌తంలో విజ‌య్ తాను డిజైన్ చేసిన బ‌ట్ట‌ల‌కు అల్లు అర్జున్ కు బ‌హుమ‌తిగా పంపగా, వాటిని అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు సంబంధించి వేడుక‌లో ధ‌రించాడు. ఇక తాజాగా మ‌రోసారి బన్నీకి బ‌ట్ట‌లు పంపాడు విజ‌య్. ఈ సంద‌ర్భంగా దేవ‌రకొండ‌తో పాటు రౌడీ క్ల‌బ్‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. నువ్వు పంపిన బ‌ట్ట‌లు చాలా కంఫోర్ట్‌గా ఉన్నాయి. నువ్వు చూపించే ఈ ప్రేమ‌కు నా ధ‌న్య‌వాదాలు అంటూ.. బ‌న్నీ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా ఆ బ‌ట్ట‌లు ధ‌రించి దిగిన ఫొటోల‌ని కూడా షేర్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu