నయనతారకు భారీ పారితోషికం ఇచ్చిన రామ్‌ చరణ్‌!

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ భారీ బడ్జెట్ ను ఖర్చు చేశారు. నయనతార కోలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నది. మెగాస్టార్ సినిమా కోసం ఆమె డేట్స్ సర్దుబాటు చేసుకుంది. డేట్స్ సర్దుబాటు చేసుకోవడంతో నయనతారకు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు.

రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా.. షూటింగ్ కోసం వచ్చినపుడు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను నిర్మాత రామ్ చరణ్ చూసుకున్నారట. ఫ్లైట్ ఖర్చులతో పాటు హోటల్ తదితర ఖర్చులన్నీ చరణ్ భరించినట్టు సమాచారం. రెమ్యునరేషన్ తో కలిసి ఈ ఖర్చులు చూసుకుంటే డబుల్ అయ్యిందని తెలుస్తోంది. హీరోయిన్ కు ఇంత మొత్తంలో ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు. నయనతారకు డిమాండ్ ఉండటంతో తప్పలేదని యూనిట్ అంటోంది.