HomeTelugu Trendingఇంద్రగంటి డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

ఇంద్రగంటి డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

Vijay devarakonda with indr
రౌడీ హీరో విజయ్ దేవరకొండ… పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ సినిమా నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా ‘ఖుషి’ని విజయ్ దేవరకొండ పట్టాలెక్కించాడు. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే కశ్మీర్ లో ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ సినిమా తరువాత మళ్లీ ఆయన పూరి దర్శకత్వంలోనే ‘జనగణమన’ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఆ తరువాత విజయ్ దేవరకొండ సినిమా మోహనకృష్ణ ఇంద్రగంటితో ఉండనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కథ చెప్పడం .. విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక ఇంద్రగంటి తాజా చిత్రంగా రూపొందిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu