HomeTelugu Trendingరేపు విజయ్‌ దేవరకొండ 9 చిత్రం టైటిల్‌ ప్రకటన

రేపు విజయ్‌ దేవరకొండ 9 చిత్రం టైటిల్‌ ప్రకటన

8 12క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత సినిమాను ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు నడుస్తుందా? ఆగిపోయిందా? అనే సందేహం తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకి ఇది 9వ చిత్రం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu