HomeTelugu Trendingయూరప్‌లో విజయ్‌ దేవరకొండ.. న్యూలుక్‌ వైరల్‌

యూరప్‌లో విజయ్‌ దేవరకొండ.. న్యూలుక్‌ వైరల్‌

Vijay deverakonda in europe
టాలీవుడ్‌ రౌడీ హీరో విజ‌య్‌ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం యూర‌ప్ వీధుల్లో చెక్క‌ర్లు కొడుతున్నారు. రిలాక్స్ అయ్యేందుకు యూర‌ప్ చెక్కేశాడు విజయ్‌. క్యాజువ‌ల్ లెనిన్ షర్ట్‌, లాంగ్ హేయిర్‌తో సూప‌ర్ స్టైలిష్‌గా ఉన్న విజ‌య్ చాలా ఉల్లాసంగా క‌నిపిస్తున్నారు. విజ‌య్ న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ప‌ని ఒత్తిడి, న‌టుడిగా సాధార‌ణంగా క‌లిగే అసౌక‌ర్యాల నుంచి త‌ప్పించుకునేందుకు, మ‌రీ ముఖ్యంగా అక్క‌డ దొరికే అద్భుత‌మైన ఆహారం కోసం యూర‌ప్‌కు వెళ్లిన‌ట్లు పేర్కొన్నాడు విజయ్‌. ప్రస్తుతం విజయ్‌దేవర కొండ ‘ఫైటర్‌’ సినిమా చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు సుకుమార్ డెరెక్ష‌న్‌లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu