HomeTelugu Trending'గీతా ఆర్ట్స్‌' బ్యానర్లో మూడోసారి రౌడీ హీరో!

‘గీతా ఆర్ట్స్‌’ బ్యానర్లో మూడోసారి రౌడీ హీరో!

4 9
యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్లో నటించిన ‘టాక్సీవాలా’.. ‘గీత గోవిందం’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ‘గీత గోవిందం’ వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ మరో మూవీ చేయనున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14వ తేదీన ఈసినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ, విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలనే ఆసక్తితో వున్నట్టుగా చెప్పారు. విజయ్ దేవరకొండ ఓకే అంటే తన వైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండదని అన్నారు. దాంతో ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ మూడో సినిమా తెరకెక్కడం ఖాయమనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu