HomeTelugu Trending'వస్తున్నా.. వచ్చేస్తున్నా' ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన శేఖర్‌కమ్ముల

‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన శేఖర్‌కమ్ముల

Vasthunna vachesthunna fir

‘కౌసల్య కృష్ణమూర్తి, పడేశావే, ఆపరేషన్‌గోల్డ్‌ ఫిష్‌’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటించిన చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తుంది. తేజస్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ
దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు.

Vasthunna vachesthunna 2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

Vasthunna vachesthunna 1

దర్శక నిర్మాత సందీప్‌ గోపిశెట్టి మాట్లాడుతూ .. ‘శేఖర్‌ కమ్ముల గారితో మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పక అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్‌, భీమనేని శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా.శేషసాయి ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu