HomeTelugu Trending'జవాన్‌'లో విజయ్‌

‘జవాన్‌’లో విజయ్‌

Vijay in Jawaan
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జవాన్‌. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఫిమేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేయగా.. తాజాగా మరొక అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. ఈసినిమాలో దళపతి విజయ్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదే క్రమంలో ‘జవాన్’ మూవీకి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన యానిక్ బెన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన అసలు విషయాన్ని రివీల్ చేశాడు.

‘జవాన్’ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అలాగే ఆగస్ట్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జవాన్’ మూవీలో గెస్ట్ రోల్ చేసినట్లు యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ వెల్లడించాడు. ఇంకా ఈ చిత్రంలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె స్పెషల్‌ అప్పియరెన్స్ సైతం ప్లాన్ చేసినట్లు టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu