HomeTelugu Trendingఖుషి సెకండ్ సింగిల్ రిలీజ్

ఖుషి సెకండ్ సింగిల్ రిలీజ్

Kushi second single
విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.

ప్రేమకథా చిత్రాలను మంచి ఫీల్ తో తెరకెక్కించగలడనే పేరు శివ నిర్వాణకి ఉంది. తనదైన శైలిలో ఆయన రూపొందించిన ఈ సినిమా,

ఖుషి సినిమా నుంచి సెకండ్ లిరికల్‌ను రిలీజ్ చేశారు. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ‘పదమునీవైపిలా, పరుగు నీవే కదా, తనువు తెరమీదుగా, చేరుకో త్వరగా’ అంటూ సాగుతోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించారు. సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు.

సెకండ్ లిరికల్ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలై ఆకట్టుకుంటోంది. బీట్ కొత్తగా ఉంది, మంచి ఫీల్ కనిపిస్తోంది. ఈ మూవీలో విజయ్, సమంతతో పాటు ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, మురళీశర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమా హిట్ అటు విజయ్ దేవరకొండతో పాటు సమంతకు కూడా చాలా అవసరం. ఈ సినిమాలో హీరోయిన్ దివ్యాంశ కౌషిక్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సమంతకు చెల్లెలు పాత్ర చేసినట్లు చెప్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu