HomeTelugu Trendingబాలీవుడ్‌ హీరోకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

బాలీవుడ్‌ హీరోకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

Vijay sethupathi as a villa
కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. హీరోగానే కాకుండా.. విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ మూవీతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన త్వరలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో తలపెడేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ హీరోగా దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో జవాన్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో విలన్‌గా విజయ్‌ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జరుపుకుంటోంది. అయితే ఇందులో పవర్ఫుల్ విలన్ పాత్రను అట్లీ డిజైన్‌ చేశాడట. ఇక ఈ పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే బాగుంటుందని దర్శకుడు షారుక్‌ను ఒప్పించినట్లు టాక్‌. దీంతో వెంటనే విలన్‌ రోల్‌ కోసం మూవీ టీం ఇప్పటికే విజయ్‌ సేతుపతిని సంప్రదించిన్నట్లు తెలుస్తుంది.

ఇక దీనికి విజయ్‌ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. త్వరలోనే సినిమా షూటింగు సెట్‌లో అడుగు పెడతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి హిందీ చిత్రంలో విలన్‌గా అంటే మంచి ఆఫర్‌ అని, ఈ సినిమాతో విజయ్ సేతుపతి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగగా.. సాన్య మల్హోత్రా, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu