HomeTelugu Trending'వాట్‌ ఈజ్‌ దిస్‌ హడావుడి మ్యాన్‌'.. .ఫొటోగ్రాఫర్లతో విజయ్‌ దేవరకొండ

‘వాట్‌ ఈజ్‌ దిస్‌ హడావుడి మ్యాన్‌’.. .ఫొటోగ్రాఫర్లతో విజయ్‌ దేవరకొండ

6 25

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చిరాకుపడినా స్టైలిష్‌గానే ఉంటుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇటీవల విజయ్‌ పని నిమిత్తం ముంబయి వెళ్లారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయన ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. ‘వెల్‌కం టు ముంబయి భాయ్‌’ అంటూ ఆయనకి స్వాగతం పలికారు. విజయ్‌ కారులో ఎక్కేంత వరకు ఫొటోలు తీస్తూనే ఉన్నారు. మరోపక్క అభిమానులు కూడా సెల్ఫీల కోసం వెంటపడ్డారు. వారిని చూసిన విజయ్‌..’వాట్‌ ఈజ్‌ దిస్‌ హడావుడి మ్యాన్‌’ అన్నారు. ఆయన అన్న మాట అక్కడి ఫొటోగ్రాఫర్లకు అర్థంకాలేదు. ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్‌ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే దీన్ని హిందీలోనూ రీమేక్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu