HomeTelugu Newsమెగా మేనల్లుడికి విలన్‌గా విజయ్ సేతుపతి.!

మెగా మేనల్లుడికి విలన్‌గా విజయ్ సేతుపతి.!

6 11మెగా ఫ్యామీలి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలే వచ్చారు. ఇప్పటికి వస్తూనే ఉన్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాలకు లాగే ఇది కూడా బోల్డ్ కంటెంట్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్రలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవి విజయ్ సేతుపతి పేరును సజెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

తమిళంలో విజయ్ చాలా బిజీ అయ్యాడు. హీరోగా చేస్తూనే.. విలన్ పాత్రలు చేస్తున్నారు. తెలుగులో విజయ్ సేతుపతి మెగాస్టార్ సైరా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ నటనకు ముగ్దుడైన మెగాస్టార్.. విజయ్ పేరును సుకుమార్ సినిమాకు సజెస్ట్ చేశారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu