HomeTelugu Newsవిజయ్‌కి విలన్‌గా విజయ్‌ సేతుపతి

విజయ్‌కి విలన్‌గా విజయ్‌ సేతుపతి

12 10తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కొత్తదనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాడు. అందువల్లనే ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తుంటాడు. ఈ తరహా పాత్రల్లో ఇతర భాషా చిత్రాల్లో చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతుంటాడు.

తాజాగా ఆయన హీరో విజయ్ తో విలన్ గా తలపడటానికి సిద్ధమవుతున్నట్టుగా కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం విజయ్ అట్లీ కుమార్ తో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తన 64వ సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో విలన్‌ పాత్రను విజయ్ సేతుపతి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయననే ఖరారు చేశారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో వినిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu