మూడో షెడ్యూల్‌ లో ‘బెలూన్‌’!

జై-అంజలి కాంబినేషన్‌లో వచ్చిన ‘జర్నీ’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఈ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో ఇప్పుడు ‘బెలూన్‌’ అనే చిత్రం నిర్మాణం అవుతోంది. 70 ఎంఎం ఫిలింస్‌ పతాకంపై టిఎన్‌ అరుణ్‌ బాలాజీ, కందసామి నందకుమార్‌ నిర్మిస్తున్న ‘బెలూన్‌’ చిత్రం ద్వారా ఎస్‌.శినీష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మర్యాద రామన్న’ ఫేం నాగినీడు మెయిన్‌ విలన్‌గా నటిస్తుండగా యువన్‌ శంకర్‌రాజా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.
దర్శకుడు ఎస్‌.శినీష్‌ మాట్లాడుతూ – ”సెప్టెంబర్‌ 25 నుండి కొడైకెనాల్‌లో మూడో షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో 80 శాతం చిత్రం పూర్తవుతుంది. రెండో షెడ్యూల్‌లో 50 లక్షల వ్యయంతో చెన్నైలో నిర్మించిన సెట్‌లో తీసిన సీన్స్‌ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. మెయిన్‌ విలన్‌గా నాగినీడు పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది. ‘జర్నీ’ జై-అంజలి కాంబినేషన్‌లో ‘బెలూన్‌’ రూపొందుతున్నందువలన తెలుగులో ఈ చిత్రానికి చాలా భారీగా ఆఫర్స్‌ వస్తున్నాయి. దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం అయినా ఓ సూపర్‌హిట్‌ చిత్రంగా ‘బెలూల్‌’ని రూపొందించాలన్న పట్టుదలతో వర్క్‌ చేస్తున్నాను. ‘బెలూన్‌’ చాలా చాలా మంచి సినిమా అవుతుంది” అన్నారు.
జై, అంజలి, జనని అయ్యర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.శరవణన్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాతలు: టి.ఎన్‌.అరుణ్‌ బాలాజీ, కందసామి నందకుమార్‌, దర్శకత్వం: ఎస్‌.శినీష్‌.

 

CLICK HERE!! For the aha Latest Updates