HomeTelugu News'ఉప్పెన' నుండి విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌..

‘ఉప్పెన’ నుండి విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌..

13 7
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి కృతి శెట్టి పరిచయమవుతోంది. ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ‘రాయనం’ పాత్రలో ఆయన కనిపించనున్నాడు.

‘రాయనం’ పాత్రలో విజయ్ సేతుపతి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సముద్ర తీరంలో బ్లాక్ అంబాసిడర్ కారు పక్కనే మాస్ లుక్ తో విజయ్ సేతుపతి చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో జాలరి గూడానికి చెందినవాడిగా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu