సానియా మీర్జా బయోపిక్‌

ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు ధోనీ, మేరీకోమ్‌, మిల్కాసింగ్‌, మహవీర్‌ సింగ్(దంగల్‌)ల జీవితం తెరపై అభిమానుల్ని కనువిందు చేయగా.. ఇప్పుడు భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్‌ కూడా తెరపైకి రానుంది. గత కొంత కాలంగా ఆమె బయోపిక్‌పై వస్తున్నఊహాగానాలకు తెరపడింది. ఒప్పందంపై సంతకం చేసినట్లు శుక్రవారం తనే స్వయంగా ప్రకటించింది. ‘ చాలా కాలంగా నా బయోపిక్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఒప్పందం కుదిరింది. ఇది నా స్టోరీ కాబట్టి నా ఇన్‌పుట్స్‌ చాలా కీలకం. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. నటులు, రచయితలు ఎవరూ అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇకపై పరస్పర సహకారంతో ముందుకు వెళతాం’ అని తెలిపింది. అయితే ‘ఉరీ’ సినిమా దర్శకుడు రోనీ స్క్రూవాలా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తన జీవితాన్ని’ఏస్‌ ఎగెనెస్ట్‌ ఆడ్స్‌’ పేరిట సానియా పుస్తక రూపంలో తెచ్చిన విషయం తెలిసిందే.