విజయ్ తో శంకర్‌ మూవీ!

స్టార్ డైరెక్టర్ శంకర్ ‘2 పాయింట్ 0’ విడుదలై చాలా రోజులే కావొస్తున్నా ఇంకా తన కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయదు 2’ తీయాలని అనుకుని మొదలు పెట్టిన నిర్మాతలతో తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమమా ఆగిపోయింది. దీంతో ఆయన మరొక స్టార్ హీరో విజయ్ హీరోగా సినిమా చేయాలని అనుకుంటున్నట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వారి మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అవి ఒక కొలిక్కి వచ్చి సినిమా సెట్టయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే గతంలో శంకర్, విజయ్ ఇద్దరూ ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని తమిళంలోకి ‘నన్ బన్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.