HomeTelugu Newsఫుట్‌బాల్ కోచ్‌గా కోలీవుడ్ స్టార్ హీరో..!

ఫుట్‌బాల్ కోచ్‌గా కోలీవుడ్ స్టార్ హీరో..!

2 19కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా త్వరలో తెర‌కెక్కనుంది. విజ‌య్ సరసన స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార న‌టించ‌నుంది. క‌తిర్‌, యోగి బాబు, వివేక్ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించ‌నున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. దీపావళికి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. సోమవారం నుండి షూటింగ్ ప్రారంభం అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ సినిమాలో ‘ఇల‌య ద‌ళ‌ప‌తి’ విజ‌య్ ఫుట్‌బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని కోలీవుడ్ టాక్‌. ఏ పాత్రలోనైనా నటించి మెప్పించే విజయ్.. ఈ సరికొత్త పాత్రతో ఎలా అలరిస్తాడో చూడాలి. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌లో వచ్చిన తెరి, మెర్స‌ల్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu