HomeTelugu Newsతొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్‌ 'నాంది'

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్‌ ‘నాంది’

5 14
‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్ కనకమేడల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తాజాగా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలింది.

తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ‘అల్లరి’ నరేష్‌ కి ఇది 57వ సినిమా. ఇంతవరకూ ఈ తరహా పాత్రను చేయలేదనీ, తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ‘బంగారు బుల్లోడు’ టైటిల్ తో ‘అల్లరి’ నరేష్ నుంచి మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu