నితిన్‌తో సంప‌త్ నంది?

ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో అస‌లు వ‌ర్క‌వుట‌వ్వ‌దు అనుకున్న స్క్రిప్టు అనూహ్యంగా వ‌ర్క‌వుట‌వుతుంది. వ‌ర్క‌వుట‌వుతుంది అనుకున్న‌ది కాస్తా ఊహించ‌ని ఫ‌లితాన్నిస్తుంది. సేమ్ స‌న్నివేశం నితిన్ కి ఎదురైంది. వాస్త‌వానికి సంప‌త్ నంది ‘గౌత‌మ్‌నందా’ స్క్రిప్టు తొలుత నితిన్‌కే వినిపించాడు. కానీ దానిని నితిన్ కాద‌నుకున్నాడు. ఆ త‌ర్వాత అదే స్క్రిప్టుతో గోపిచంద్ హీరోగా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కిం చాడు. అయితే ఆ త‌ర్వాత నితిన్ ఎంతో న‌మ్మి చేసిన ‘లై’ మాత్రం అనుకున్నంత బెస్ట్ రిజ‌ల్ట్‌ని ఇవ్వ‌లేదు.
అదంతా స‌రే.. ప్ర‌స్తుతం నితిన్‌కి సంప‌త్ ఓ క‌థ చెప్పాడట‌. నితిన్‌తో సంప‌త్‌- రాధామోహ‌న్ జోడీ ప‌ని చేసే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌కి ‘ర‌చ్చ‌’తో మాస్ రాజాకి ‘బెంగాళ్ టైగ‌ర్’ లాంటి మాస్ హిట్లు ఇచ్చిన సంప‌త్.. ఈసారి నితిన్ తో ఆ త‌ర‌హా మ్యాజిక్ చేయ‌గ‌ల‌డ‌నే ఆశిద్దాం.