HomeTelugu Trendingసుశాంత్ సింగ్ మృతి కేసుపై విజయశాంతి స్పందన

సుశాంత్ సింగ్ మృతి కేసుపై విజయశాంతి స్పందన

Vijayashanti respond on Sus
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో వాస్తవాలను బయటపెట్టేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషులను పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయం అన్నారు. కానీ మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్కరి ఆత్మకు శాంతి కలిగేలా ఈ స్థాయిలో విచారణలు జరగలేదు. చాలామంది హీరోయిన్లు అనుమానాస్పదంగా మృతిచెందడం, నామమాత్రంగా విచారణ జరపడమే అయింది. సుశాంత్ కేసులో బయటకు వస్తున్న నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చిన కళాకారులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం బాధాకరం అన్నారు. ఎవరి విషయంలోనైనా విచారణలు వివక్ష లేకుండా నిర్వహించాలని కోరారు. సెలబ్రిటీలైనా, సామాన్యులకైనా న్యాయ ప్రక్రియ ఒకేవిధంగా ఉండాలన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu