HomeTelugu Trending'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్‌

‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్‌

Vinaro bhagyamu vishnu kath

కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకి మురళీ కిశోర్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో కశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే ‘విష్ణు’ అనే యువకుడి ప్రేమకథ అనే విషయం టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.

ఇక మురళీశర్మతో వేయించిన బాలయ్య బాబు .. బన్నీ స్టెప్పులు చూస్తే కామెడీ ట్రాక్ ఒక రేంజ్ లో ఉండేలానే కనిపిస్తోంది. ఆమని, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా వచ్చేనెల 17వ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu