HomeTelugu Trendingసాయితేజ్‌ 'విరూపాక్ష' ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

సాయితేజ్‌ ‘విరూపాక్ష’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

Virupaksha movie Title glim

మెగా మేనల్లుడు సాయితేజ్ ప్రమాదం తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఇది సాయితేజ్‌కు 15వ సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ను కొంతసేపటి క్రితమే రివీల్ చేశారు.

టైటిల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ను రిలీజ్‌ చేశారు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రమే ‘విరూపాక్ష’ .. అంటూ టైటిల్ విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది.

సుకుమార్ స్క్రీన్ ప్లేను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu