పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ఆసక్తికర టైటిల్‌..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత.. ‘పింక్’ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగానే క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు పవన్. ఈ సినిమాతో పాటు వరుసగా హరీష్ శంకర్, త్రివిక్రమ్ సినిమాలు కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలను కూడా బేలన్స్ చేస్తూ పవన్ తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

క్రిష్ పవన్ సినిమాను పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని టాక్. అయితే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో పవన్ పేరు వీరు అని దాంతో పాటు ఈ సినిమా కథకు కూడా ‘విరూపాక్షి’ టైటిల్ బాగుంటుందని చిత్రయూనిట్ భావిస్తుందట. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.