మూడూ సినిమాలో బిజీగా ఉన్న హీరో!

హీరో ఆది 2017లో రెండు వరుస పరాజయాలతో ఆలోచనలో పడ్డాడు. కొంచెం టైమ్ తీసుకుని మంచి కథల్ని చూజ్ చేసుకున్నాడు. గతేడాది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ’ అ నే రెండు సినిమాలను స్టార్ట్ చేసి వాటి పనుల్లో బిజీగా ఉండిపోయాడు.

మొదలుపెట్టిన ఆ రెండు సినిమాలు ముగింపు దశలో ఉండగానే ఇంకో కొత్త సినిమాకి సైన్ చేశాడు. కార్తిక్ విగ్నేష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో వేదిక హీరోయిన్‌గా నటించనుంది. ఎంజీ ఔరా సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మార్చి 25 నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. అంటే ఈ సంవత్సరం ఆది నుండి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు రానున్నాయి.