HomeTelugu Big Stories'డిటెక్టివ్' విశాల్ వచ్చేస్తున్నాడు!

‘డిటెక్టివ్’ విశాల్ వచ్చేస్తున్నాడు!

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డిటెక్టివ్‌’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ”మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా ‘తుప్పరివాలన్‌’ రికార్డు స ష్టించింది. తెలుగులో ‘డిటెక్టివ్‌’గా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. నవంబర్‌ 10న చాలా గ్రాండ్‌గా ‘డిటెక్టివ్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu