HomeTelugu Big Stories'సామాన్యుడు' మూవీ ట్రైలర్‌

‘సామాన్యుడు’ మూవీ ట్రైలర్‌

Saamanyudu movie Trailer

తమిళ హీరో విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. విశాల్‌ తన సొంత బ్యానర్‌ ‘విశాల్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’పై (VFL) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తు. పా. శరవణన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదలకానుంది. ఇదివరకే విడుదలైన టీజర్‌, ప్రచార చిత్రాలు సామాన్యుడిపై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్‌ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. సినిమాలో రొమాంటిక్‌ అంశాలు ఉన్నప్పటికీ అంతకుమించి యాక్షన్ సీన్లు ఉన్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పడం, నేరస్థుడి పుట్టుక వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. అలాగే ఇతర సంభాషణలు హైలెట్‌ కానున్నాయి. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్లలో విశాల్‌ ఎప్పటిలానే అదరగొట్టాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించింది. సినిమాలో యోగి బాబు, బాబురాజ్‌ జాకబ్‌, పీఏ తులసి, రవీనా రవి తదితరులు నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu