HomeTelugu Trendingపుట్టిన రోజు సందర్భంగా 5 లక్షలు విరాళం ఇచ్చిన విశ్వక్‌ సేన్‌!

పుట్టిన రోజు సందర్భంగా 5 లక్షలు విరాళం ఇచ్చిన విశ్వక్‌ సేన్‌!

7 27
కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ ప్రభావం వివిధ రంగాలపై కూడా తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కాగా విశ్వక్ సేన్ ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కరోనా వలన ఇబ్బందులు పడుతున్న కళాకారులకి అండగా నిలిచేందుకు తన వంతు భాద్యతగా విశ్వక్ సేన్ రూ.5లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. సినీ కార్మికులకి మనమందరం అండగా నిలబడదాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడే అని మళ్ళీ ప్రపంచం మునుపటిలాగా మారాలని.. ప్రజలందరూ ఎవరి పనుల్లో వారు సంతోషంగా ఉండాలని.. భగవంతుని ప్రార్థించడంతో పాటు మన వంతు కర్తవ్యంగా కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేసే వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బంది మరియు ఎంతోమంది నిజమైన హీరోలకు వారి బాధ్యత నిర్వర్తించే విధంగా మనం సహకారం అందించాలని విశ్వక్ సేన్ కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu