HomeTelugu Trendingవిశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా 'దాస్ కా ధమ్కీ'

విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’

Vishwak sen new movie title
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్లి పోమాకే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చన విశ్వక్‌ సేన్‌.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌ నామ దాస్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజాచిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు రెడీగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాను ప్రకటించాడు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమాకి ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీకి నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా, ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

విడాకులు ప్రకటించిన కోలీవుడ్‌ దర్శకుడు

Das Ka Dhamki.jpg3

Recent Articles English

Gallery

Recent Articles Telugu