HomeTelugu Big Storiesమెగా అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..

మెగా అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..

Vyjayanthi movies good news

ప్రస్తుతం టాలీవుడ్‌లో.. రీరిలీజ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవ‌లే సూపర్‌ స్టార్‌ మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘పోకిరి’ సినిమాని రీరిలీజ్ చేయగా..మంచి కలెక్ష‌న్లు వ‌సూళ్లు చేసింది. పోకిరి రీరిలీజ్‌కు వ‌చ్చిన క్రేజ్‌తో మా హీరో సినిమా కూడా రిలీజ్ కావాల్సిందేనంటూ ప‌ట్టుబ‌డుతున్నారు అభిమానులు. ఈ క్రమంలో.. ప‌వ‌న్ క‌ల్యాణ్- జ‌ల్సా, నాగార్జున- శివ‌, ఎన్టీఆర్- సింహాద్రి సినిమాల రీరిలీజ్ వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

తాజాగా.. మెగా అభిమానుల‌కు పండ‌గే అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ‘ఇంద్ర’ ను రీరిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్. ప్రియమైన మెగాస్టార్ అభిమానులకు.. మీరు మాత్రమే కాదు.. మేము కూడా.. ఇంద్ర 4K ప్రింట్‌ని విడుదల చేస్తాము. కానీ ఇప్పుడే కాదు.. కొంత సమయం పడుతుంది.. కానీ రిలీజ్ మాత్రం గ్రాండ్‌గా ఉండ‌బోతుంది.. అంటూ ట్వీట్ చేసింది వైజ‌యంతీ మూవీస్. ఇంకేముంది త్వ‌ర‌లోనే ఇంద్ర సినిమాను మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రాబోతుంది అన్నమాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu