రానా కూడా మొదలెట్టాడు!

రానా కూడా మొదలెట్టాడు!
నటన విషయంలోనూ, సాంకేతిక నైపుణ్యం విషయంలోనూ ఎంత టాలెంట్ ఉన్నా.. ఇండస్ట్రీలోకి 
ఎలా రావాలో తెలియని చాలా మండి ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించే విధంగా టాలీవుడ్ లో 
టాలెంట్ మేనేజ్మెంట్ కంపనీలు వస్తున్నాయి. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ ‘పూరీ కనెక్ట్స్’ పేరిట 
ఓ సంస్థను మొదలుపెట్టాడు. ఇప్పుడు రానా కూడా పూరీ బాటలాఓనే ఇలాంటి ఓ టాలెంట్ మేనేజ్మెంట్ 
కంపనీను ఏర్పాటు చేస్తున్నాడు. దీని ద్వారా కొత్త వారకి అవకాశాలు కల్పించనున్నాడు. ఇండస్ట్రీలోకి 
రావాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. నిజానికి ఈ కంపనీ ద్వారా ఎంపికైన 
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం నుండి కనీసం పది శాతం కంపనీకు వచ్చేలా డీల్ 
చేసుకుంటారు. అటు వ్యాపారం, ఇటు కొత్త వాళ్ళకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించడంతో ఇటువంటి 
వ్యాపారాల మీద ఎక్కువమంది ఇంటరెస్ట్ చూపుతున్నారు. 
CLICK HERE!! For the aha Latest Updates