దర్శకేంద్రుడు నో చెప్పాడు!

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే కథను ఫైనల్ చేశాడు. ఒకానొక దశలో బాలయ్యే డైరెక్ట్ చేయాలనుకున్నాడు కానీ డైరెక్టర్ గా, నటుడిగా సమయం సరిపోదని నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ కథ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాఘవేంద్రరావుని సంప్రదించగా ఆయన సున్నితంగా
ఆఫర్ ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కథను సినిమా చేయాలంటే మామూలు విషయం కాదూ.. దానికోసం చాలా రీసెర్చ్ చేయాలి.. కత్తిమీద సాము లాంటిదని చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ తో దర్శకేంద్రుడు చాలా సినిమాలు చేశాడు. ఆయన కూడా వెనుకడుగు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈ స్క్రిప్ట్ కు డైరెక్టర్ ఎక్కడ దొరుకుతాడో.. చూడాలి!