HomeTelugu Big Stories'వాల్తేరు వీరయ్య' ట్రైలర్‌ విడుదల

‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌ విడుదల

Waltair Veerayya movie Trai

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రధానమైన పాత్రలన్నిటినీ రివీల్ చేస్తూ ఆసక్తిని రేకెత్తించారు. ఈ ట్రైలర్‌ లోని డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈ సినిమాలో చిరంజీవి లిడర్‌గా పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. రవితేజ కీలక పాత్రలో, కేథరిన్, బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu