రవితేజతో లావణ్య రొమాన్స్!

తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని యువతతో అందాల రాక్షసి అని ముద్దుగా పిలిపించుకుంటోంది లావణ్య త్రిపాఠి. ఆమె కెరీర్ లో సక్సెస్ రేట్ బాగానే ఉంది. దానికి కారణం ఆమె కథలను ఎన్నుకునే తీరు. దూసుకెళ్తా’ .. ‘మనం’ .. ‘భలే భలే మగాడివోయ్’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఇలా అన్ని సినిమాలు ఆమెకి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం మిస్టర్ సినిమాలో నటిస్తోన్న ఈ భామ మరో రెండు క్రేజీ ఆఫర్స్ ను తన సొంతం చేసుకుంది.

శర్వానంద్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా లావణ్యను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వంలో పని చేసిన ఓ కుర్రాడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టానున్నారు. అలానే రవితేజ నటిస్తోన్న ‘టచ్ చేసి చూడు’ సినిమాలో ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేయగా మరోక హీరోయిన్ కోసం లావణ్యను సంప్రదించారు.

దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వైపు యంగ్ హీరోల సరసన నటిస్తూనే.. మరో పక్క నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతుంది.