HomeTelugu Trending'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే!

‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే!

waltair veerayya ott releasమెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మెగాస్టార్‌కు మంచి హిట్‌ని ఇచ్చింది. మెగాస్టార్‌ యాక్షన్, డ్యాన్సులు, ఫైట్స్‌ తో మాస్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇక డిజిటల్‌ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఫిబ్రవరి 27నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మాస్‌మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. మొదటిగా ఈ సినిమాకి మిక్స్డ్‌టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్‌లలో మాత్రం జోరు చూపించింది. తొలి రోజు మొదలుకొని మూడు, నాలుగు రోజుల వరకు కూడా అన్ని థియేటర్‌లలో హౌస్‌ ఫుల్‌బోర్డులు పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu