HomeTelugu Trending'మిథునం' రచయిత శ్రీరమణ కన్నుమూత

‘మిథునం’ రచయిత శ్రీరమణ కన్నుమూత

Mithuram movie writer
ప్రముఖ సినీ రచయిత, వ్యంగ్య వ్యాసకర్త శ్రీరమణ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీరమణ బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు. మిథునం సినిమాకు కథను అందించిన ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. మిథునం సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలైన బాపు, రమణలతో కలిసి ఆయన పని చేశారు. 2012లో వచ్చిన మిథునం సినిమా అద్భుత విజయం అందుకుంది.

శ్రీరమణ 1952 సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజు రామారావు. పలు తెలుగు పత్రికల్లో పనిచేశారు. వ్యంగ్య, హాస్య కాలమ్స్ నడిపారు. కాలమిస్ట్‌గా, కథకుడిగా, సినీరంగంలో పలు విధాలా సాహిత్య, కళా రంగాలకు సేవలు అందించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2014లో హాస్య రచన విభాగంలో శ్రీరమణ కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ‘పత్రిక’ అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. శ్రీరమణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu