HomeTelugu Big Stories'వాల్తేరు వీరయ్య' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Waltair veerayya release da
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ బయటకి వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 13 తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో ర‌వితేజ, రాజేంద్రప్రసాద్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్, కేథరిన్ కనిపించనున్నారు. ఇక దేవిశ్రీ స్వరపరిచిన మాస్ ఐటమ్ లో ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu