HomeTelugu Big Storiesఆసక్తికరంగా 'దసరా' టీజర్‌

ఆసక్తికరంగా ‘దసరా’ టీజర్‌

Dasara Telugu Teaserనేచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది.

గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ ఈ సినిమా టీజర్ విడులైంది. నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేశారు. అయితే ఈ టీజర్‌లో హీరోయిన్‌ కనిపించలేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ టీజర్ ను విడుదల చేశారు.

సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయికుమార్, పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మార్చి 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాని – కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu