HomeTelugu News'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' ఫస్ట్‌లుక్‌

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ ఫస్ట్‌లుక్‌

రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెర‌కెక్కుతున్న చిత్రం లో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. క్రిష్ణ కిశోర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యంగ్ హీరో నితిన్‌ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

3 2

రాయ్‌ లక్ష్మీ, పూజితా పోన్నాడలను రివీల్‌ చేస్తూ రూపొందించిన ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌ డిజైన్‌లోనే సినిమా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందన్న విషయాన్ని రివీల్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu