మెగా హీరో కోసం కథను సిద్ధం చేస్తున్న మారుతి

యూత్ పల్స్ పట్టుకుని సినిమాలు చేయడంలో ‘మారుతి’ దిట్ట. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ రెండూ సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆయన సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మెగా హీరో సాయి తేజ్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ చిత్రంలో వినోదంతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందట. ఇటీవలే ‘చిత్రలహరి’తో సక్సెస్ చూసిన తేజ్ మారుతి చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. జూన్ నుండి మొదలుకానున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates