HomeTelugu Trendingబిగ్‌బాస్‌-6 హోస్ట్‌ ఎవరో తెలుసా!

బిగ్‌బాస్‌-6 హోస్ట్‌ ఎవరో తెలుసా!

balakrishna

తెలుగు బిగ్‌బాస్‌ అతి త్వరలోనే బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. దీంతో సీజన్‌-6కి హోస్ట్‌గా ఎవరు చేయనున్నారనే దానిపై రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. నందమూరి బాలకృష్ణ ఈ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దీనిపై క్లారిటీ వచ్చేసింది.

మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ -6 ఓటీటీకి కూడా తానే హోస్టింగ్‌ చేయనున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ తెలుగు.. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్‌1 షో. వీకెండ్‌ ఎపిసోడ్‌కి సుమారు 5-6కోట్ల మంది లైవ్‌ చూశారు. దీన్ని బట్టి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌కు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు.

nagarjuna

ఇక నెక్ట్స్‌ సీజన్‌ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉండనుంది. ఇది బిగ్గెస్ట్‌ ఛాలెంజ్‌ నాకు. ఆ 24 గంటలు చూసి అనాలసిస్‌ చేసి వీకెండ్‌ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లతో ముచ్చటించాల్సి ఉంటుంది’ అని వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu