HomeTelugu Trendingవిశాల్‌ 'రత్నం' ఫస్ట్‌లుక్‌

విశాల్‌ ‘రత్నం’ ఫస్ట్‌లుక్‌

Vishal Ratnam movie first
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు.

విశాల్‌ 32వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక వ్యక్తి తలను నరికి, దాన్ని చేత్తో పెట్టుకుని, మరో చేత్తో రక్తం కారుతున్న కొడవలిని పట్టుకుని విశాల్ భయంకరంగా ఉన్నారు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. విశాల్ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. ఈ సినిమా 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకున రానున్నట్లు తెలిపారు.

20231202fr656acee9e25ae

Recent Articles English

Gallery

Recent Articles Telugu