HomeTelugu Trending'వైల్డ్‌ డాగ్‌'తో నాగార్జున

‘వైల్డ్‌ డాగ్‌’తో నాగార్జున

9 21
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించారు. మహర్షి చిత్రానికి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఆయన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్‌ ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాగార్జున శుక్రవారం విడుదల చేశారు. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రానికి నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ‘వైల్డ్‌ డాగ్‌’ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసిన నాగ్‌ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘చాలా రోజుల తర్వాత ఓ యదార్థ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఎన్‌ఐఏ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాను. కొంత టెక్నీషియన్స్‌తో వినూత్నంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. 2020 ఎంతో అద్భుతంగా ఉండబోతోంది.’ అని నాగ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu