‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్‌

హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, ప్రణతి హీరోయిన్ల్‌గా నటిస్తున్నారు. ఈ టీజర్‌లో రామ్ వళ్ళు విరుస్తూ..హాల్లోకి రావడం.. అప్పుడే తల స్నానం చేసి వచ్చి.. హాల్లో అటు తిరిగి జుట్టుకు సామ్రాణి వేసుకోవడం.. చూశావా అని అనుపమ అడగడం.. రామ్ సైలెంట్ గా ఆమె నడుమువైపు చూస్తూ తల ఊపడం.. ఎలా ఉంది అని అడిగితే.. చాల హాట్ గా ఉందని నిదానంగా చెప్పగా.. కాఫీ అని అనుపమ చెప్పడంతో రామ్ కాఫీని తీసుకుంటాడు.

 

ఈ సినిమాకు త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18 న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.