HomeTelugu Trending‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌

‘వైల్డ్‌డాగ్‌’ ట్రైలర్‌

Wild dog trailer 1
టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ట్రైలర్‌ ఈరోజు శుక్రవారం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన, తన టీమ్‌తో కలిసి ఎలా మట్టుపెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే. ‘‘ఒక మన దేశంలో వందల మందిని చంపి మీరేమీ చేయలేరు అంటే.. నేను అందుకు అంగీకరించను’’ అంటూ నాగార్జున చెబుతున్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 2న ‘వైల్డ్‌డాగ్‌’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu