HomeTelugu Trendingపంచతంత్రంలో సముద్రఖని

పంచతంత్రంలో సముద్రఖని

Panchathantram Team wishes

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఈ చిత్ర టైటిల్‌ లుక్‌తో పాటు, క్యారెక్టర్స్‌ తెలియజేసే వీడియో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. సోమవారం సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా… ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామనాథం పాత్రలో సముద్రఖని ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ”సముద్రఖనిగారికి జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప నటుడు, వ్యక్తి మా సినిమాలో నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓ నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా షూటింగ్‌ చాలావరకు పూర్తయింది. మరో పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం” అని తెలుపగా.. ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. ”పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో సముద్రఖనిగారు రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu