పవన్ కల్యాణ్ ఫౌంహౌస్‌ దగ్గర దారుణ హత్య!

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఫాంహౌస్‌ సమీపంలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ శివారులో ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మహిళ వివరాలు కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వారం క్రితం హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. హత్యచేయబడ్డ మహిళ ఏ
ప్రాంతానికి చెందినది, ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? హత్య వెనుక నిందితులెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.