HomeTelugu Big Stories'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' టీజర్‌ వచ్చేసింది

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ వచ్చేసింది

5 2
యంగ్‌ హీరో.. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ వచ్చేసింది. ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా నాలుగు పోస్టర్లను విడుదల చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. రాశీ, ఐశ్వర్య, కేథరిన్‌, ఇజబెల్లె.. ఈ నలుగురు విజయ్‌ సరసన కనిపించడం దీనికి కారణం. టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu