HomeTelugu Big Stories'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ట్రైలర్‌.. అదరగొట్టిన విజయ్‌ దేవరకొండ

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ట్రైలర్‌.. అదరగొట్టిన విజయ్‌ దేవరకొండ

9 5

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ సినిమాకి ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్‌.. నలుగురు అమ్మాయిలను ప్రేమించిన యువకుడిగా కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, రాఖీఖన్నా, కేథరిన్‌, ఇజబెల్లె లైట్‌ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ‘బొగ్గుగనిలో రంగు మణిరా’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం సోషల్‌మీడియా వేదికగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌. ఈ ట్రైలర్‌ విజయ్‌ దేవరకొండ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘గుండెకు తగిలిన దెబ్బకు నొప్పి తెల్వకుండా ఉండాలంటే ఫ్లిజికల్‌గా ఈ మాత్రం బ్లిడింగ్‌ ఉండాలి.’ అని ట్రైలర్‌ చివర్లో విజయ్‌ చెప్పే డైలాగ్‌లు ప్రేమికులను మెప్పించేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu