లవకుమార్ గా ఎన్టీఆర్ ఇదిగో ఫోటో!

ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. షూట్ చేసేప్పుడు క్లాప్ బోర్డ్ మీద జైలవకుశ అని ఉండడంతో ఇదే టైటిల్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా స్పాట్ కు హరికృష్ణ వెళ్లారు. అక్కడి నుండి ఓ ఫోటో తీసి బయటకు వదిలారు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆఫీసర్ ల కనిపిస్తున్నారు. ఆయన ఎదురుగా నేమ్ ప్లేట్ మీద ‘ఎన్ లవకుమార్’ అని రాసి ఉంది. దీన్ని బట్టి దర్శకుడు టైటిల్ తగ్గ న్యాయం చేస్తున్నాడనిపిస్తుంది.